SDPT: హైదరాబాద్లో అగస్త్య ఫౌండేషన్ నిర్వహించిన ‘రాష్ట్రస్థాయి ఇన్నోవేషన్ ఎక్స్ప్రెస్’ పోటీల్లో మర్కూర్ మండలం, దామరకుంట ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మెరిశారు. విద్యార్థులు వర్షిత, పైతారా, భవ్య శ్రీ రూపొందించిన ‘రైతులకు చేయూతనిచ్చే బహుళ ప్రయోజనకర పనిముట్లు’ ప్రదర్శనకు రాష్ట్రస్థాయిలో ద్వితీయ బహుమతి లభించింది. దీంతో పాఠశాల ఉపాద్యాయులు విద్యార్థులను అభినందించారు.