RR: షాద్నగర్ నియోజకవర్గం చౌదరి గూడ మండలం చింతకుంట తండా గ్రామపంచాయతీని అభివృద్ధి పథంలో నడిపించడానికి సిద్ధంగా ఉన్నామని సర్పంచ్ దేవిరాంచరణ్ అన్నారు. రూ. 10 లక్షలతో మంజూరైన మహిళా సమాఖ్య బిల్డింగ్ స్లాబ్ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వ సహకారంతో గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకోవడానికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.