WGL: పర్వతగిరి మండలం సోమారం గ్రామంలో వ్యక్తి అదృశ్య మయ్యాడు.మట్టపల్లి కిట్టు అనే వ్యక్తి ఈనెల 5 నుంచి కనిపించకుండా పోయాడని కుటుంబ సభ్యులు తెలిపారు. బంధువుల ఇల్లు, తెలిసిన వారి ఇల్లలో వెతికినప్పటికీ ఆచూకీ దొరకలేదని ఎవరికైనా కనిపిస్తే 94404 26219 నెంబర్ కు సమాచారం అందించాలని వారు తెలిపారు. ఇవాళ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు.