NLR: మహిళా సాధికారతే ధ్యేయంగా మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కృషి చేశారని వైసీపీ రాష్ట్ర మహిళ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజిత తెలిపారు. మహిళల కోసం ఆయన ఎన్నో సంక్షేమ పథకాలు తీసుకువచ్చి వారి అభ్యున్నతికి తోడ్పాటు అందించారన్నారు. జగన్ అండతోనే తాము ఈ స్థాయికి ఎదిగామని చెప్పడానికి గర్వంగా ఉందని అన్నారు.