ADB: ఇంద్రవెల్లి మండలంలోని ముత్నూర్ గ్రామంలో శనివారం జిల్లా పాలనాధికారి రాజర్షి షా పర్యటించారు. ఈ సందర్బంగా పలు భోజనశాలను పరిశీలించి విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. మెనూ ప్రకారమే భోజనం అందించాలని సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో DMHO రవీందర్ రాథోడ్, అదనపు జిల్లా వైద్యాధికారి మనోహర్, పూజిత తదితరులు పాల్గొన్నారు.