KNR: కాళేశ్వరం ప్రాజెక్ట్ పనికిరాదని విమర్శించిన ముఖ్యమంత్రి.. ఇప్పుడు అదే ప్రాజెక్టు నీటిని ఎలా తరలిస్తున్నారో సమాధానం చెప్పాలని మాజీ మంత్రి హరీశ్‌రావు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా కురిక్యాల వద్ద వరద కాలువను ఆయన పరిశీలించారు. ఆ నీళ్లతో రైతులు పంటలు పండించడం లేదని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.