CTR: తవణంపల్లి మండలం జి. గొల్లపల్లి గ్రామానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త, సిద్ధార్థ్ ఆగ్రో ప్రాసెసింగ్ యూనిట్ అధినేత గుర్రం రఘురామ్ చౌదరి జనసేన పార్టీలో చేరారు. హైదరాబాద్లో ఎమ్మెల్సీ కొణిదెల నాగబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తాళ్ళురి సమక్షంలో ఆయనకు జనసేన కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రఘురామ్ తెలిపారు.