ASR: విధుల నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించబోమని ఎమ్మెల్యే రేగం మత్స్యలింగం హెచ్చరించారు. శనివారం డుంబ్రిగూడ మండల పరిషత్ కార్యాలయంలో జరిగిన సర్వసభ్య సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అధికారులు ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించాలని సూచించారు. సమావేశాలకు ఆలస్యంగా వచ్చే అధికారులపై చర్యలు తీసుకోవాలని ఎంపీడీవోని ఆదేశించారు.