సత్యసాయి: అగళి మండలం హల్లికెర పంచాయతీలో అభివృద్ధి పనులు వేగవంతమయ్యాయి. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, ఎమ్మెల్యే ఎంఎస్ రాజు, మాజీ ఎమ్మెల్సీ గుండుమల తిప్పేస్వామి ఆదేశాల మేరకు సుమారు రూ. 15 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులను శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పార్టీ శ్రేణులు, తదితరులు పాల్గొన్నారు.