KRNL: విలేజ్ సర్వేయర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఇవాళ సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు డిమాండ్ చేశారు. కలెక్టర్ కార్యాలయం వద్ద సర్వేయర్లు చేపట్టిన ఆందోళనకు సీఐటీయూ సంపూర్ణ మద్దతు ప్రకటింది. సస్పెండ్ చేసిన సంఘ నాయకులను తిరిగి విధుల్లోకి తీసుకుని, ప్రమోషన్లు, సమాన వేతనం అమలు చేయాలని కోరారు.