TPT: సూళ్లూరుపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహించిన మహిళా దినోత్సవ కార్యక్రమంలో జూనియర్ సివిల్ కోర్టు జడ్జి సంయుక్త పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. భారతదేశంలో మహిళలు అన్ని రంగాల్లో రాణిస్తున్నారని, జీవితంలో ఎదురయ్యే కష్టాలను అధిగమించి ఉన్నత శిఖరాలను చేరాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ శంకర్ శర్మ, అధ్యాపకులు పాల్గొన్నారు.