TG: హౌసింగ్‌బోర్డు రిజిస్ట్రేషన్ పోర్టల్‌ను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ ప్రారంభించారు. దీంతోపాటు హౌసింగ్ బోర్డు 99 రోజుల కార్యాచరణ పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఈనెలాఖరులోపు లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలు జరగనున్నట్లు వెల్లడించారు. మంజూరైన ఇందిరమ్మ ఇళ్లన్నీ నిర్మాణాలు ప్రారంభం కావాలని.. సకాలంలో బిల్లులు చెల్లించాలని అధికారులకు సూచించారు.