AP: సీఎం చంద్రబాబుపై మాజీ మంత్రి కురసాల కన్నబాబు మండిపడ్డారు. ‘కాగ్ నివేదిక చూస్తే. రాష్ట్ర పరిస్థితి ఎంత దిగజారిపోయిందో కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయిందని చెబితే.. చంద్రబాబు మాత్రం ప్రజలను అసెంబ్లీలో మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పరిమితికి మించి అప్పులు చేయడం ద్వారా రాష్ట్రం అధోగతి పాలవబోతుంది’ అంటూ విమర్శించారు.