విశాఖ ద్వారకా బస్ స్టేషన్ను ఏపీఎస్ఆర్టీసీ రీజినల్ మేనేజర్ బి.అప్పలనాయుడు శనివారం తనిఖీ చేశారు. నగరంలో ట్రాఫిక్ రద్దీ ఎక్కువగా ఉండటంతో డ్రైవర్లు తప్పనిసరిగా ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ డిఫెన్సివ్ డ్రైవింగ్ చేయాలని సూచించారు. గత రెండు వారాలుగా డ్రైవర్లకు ప్రతి మంగళ, శుక్రవారాల్లో ట్రైనింగ్ తరగతులు నిర్వహిస్తున్నామని తెలిపారు.