AKP: ఈనెల 31 నాటికి పీఎంఏవై గృహాలను పూర్తి చేసేలా దృష్టి సారించాలని జిల్లా హౌసింగ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎన్.శ్రీనివాసరావు ఆదేశించారు. నాతవరం ఎంపీడీవో కార్యాలయంలో శనివారం హౌసింగ్ సిబ్బంది, ఇంజనీరింగ్ అసిస్టెంట్లతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గృహ నిర్మాణాల పురోగతిని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ కారణాలపై ఆరా తీశారు.