NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీలోని సిలార్పల్లి, తిమ్మరాసిపల్లి ప్రాంతాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేస్తూ జనాన్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. తాజాగా సిలార్పల్లి సమీపంలోని పొలంలో దాదాపు 30 గొర్రెలపై కుక్కలు దాడి చేసి చంపివేయడం కలకలం రేపింది. అటు పెంపుడు కోళ్లను సైతం వదలకుండా వేటాడుతున్నాయని, అధికారులు కుక్కల బెడద నుంచి కాపాడాలని కోరుతున్నారు.