VKB: పరిగి పట్టణంలోని బాహార్పేట్లో బీహార్‌కు చెందిన యువకులు హంగామా సృష్టించారు. గంజాయి కోసం ఇద్దరు యువకులు పరస్పరం దాడి చేసుకున్నారు. లక్ష్మీదేవిపల్లిలోని సుగుణ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న యువకుల్లో ఒకరు గంజాయి తాగుతుండగా, మరో యువకుడు ఇవ్వాలని అడిగాడు. ఇవ్వలేదనే కారణంతో ఇద్దరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుని, అది చివరకు పరస్పర దాడికి దారి తీసింది.