KNR: వీణవంక మండలంలోని కొండపాకలో పెద్దమ్మ తల్లి విగ్రహ ప్రతిష్ఠాపన మహోత్సవం కనులపండువగా జరిగింది. అర్చకులు అమ్మవారికి ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించారు. ఈ వేడుకలో హుజురాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ప్రణవ్ పాల్గొని మొక్కులు తీర్చుకున్నారు. సర్పంచ్ పాటు పెద్ద సంఖ్యలో గ్రామస్తులు, భక్తులు తరలివచ్చి తీర్థప్రసాదాలు స్వీకరించారు.