KRNL: పెద్దకడబూరు మండలం గవిగట్టు గ్రామంలో కొత్తగా ఏర్పాటు చేసిన పైప్లైన్ల ద్వారా శుక్రవారం తాగునీటి సరఫరా ప్రారంభమైంది. యువ నాయకుడు మునిస్వామి ఆధ్వర్యంలో 6 వీధుల్లోని ప్రతి ఇంటికీ నీరు అందేలా చర్యలు చేపట్టారు. పైప్లైన్లను పరిశీలించి, నీటి సరఫరా సక్రమంగా జరుగుతుందని నిర్ధారించారు. ఏళ్ల నాటి తాగునీటి సమస్య పరిష్కారం కావడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.