MBNR: జిల్లా కేంద్రాన్ని రాబోయే ఐదేళ్లలో అద్భుతంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు. జిల్లా కేంద్రంలోని 31వ డివిజన్ గణేశ్ నగర్లో నిర్వహించిన ‘ప్రజాపాలన -ప్రగతి ప్రణాళిక’ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. 99 రోజుల పాటు సాగే ఈ ప్రణాళికను పక్కాగా అమలు చేసి, ప్రజల అవసరాలను తీరుస్తామని ఈ సందర్భంగా పేర్కొన్నారు.