కోనసీమ: అమలాపురం రూరల్ మండలం సవరప్పాలెం గ్రామంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పలు అభివృద్ధి పనులను ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు మంగళవారం ప్రారంభించారు. మౌలిక సదుపాయాల కల్పనే ధ్యేయంగా రూ. 79.54 లక్షలతో నిర్మించిన జల్ జీవన్ మిషన్ వాటర్ ట్యాంక్‌ను, ఉపాధి హామీ పథకం నిధులు రూ. 28.80 లక్షలతో నిర్మించిన హెల్త్ క్లినిక్ భవనాన్ని ప్రారంభించారు.