NLG: దేవరకొండ మండల పరిధిలోని కొర్రతండాలో ఎమ్మెల్యే బాలునాయక్ సహకారంతో రూ. 5 లక్షల వ్యయంతో మంజూరైన సీసీ రోడ్డు పనులను సర్పంచ్ కొర్ర రాంసింగ్ నాయక్ గ్రామస్థులతో కలిసి ప్రారంభించారు. నాణ్యతతో పనులు పూర్తి చేసి తండా వాసుల సమస్యలను తీరుస్తామని సర్పంచ్ ఈ సందర్భంగా తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు, మాజీ సర్పంచ్ పాండు నాయక్, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.