E.G: అనపర్తి మండలం లక్ష్మీనరసాపురంలో సోమవారం అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గ్రామానికి చెందిన సురకాసుల గోవిందు కుటుంబ సభ్యులు వేసవి తాపానికి ఇంటికి తాళం వేసి మేడపై పడుకోగా, దుండగులు తాళాలు పగలగొట్టి లోపలికి ప్రవేశించారు. బీరువాలోని 11 కాసుల బంగారు ఆభరణాలను దోచుకెళ్లారు. మంగళవారం బాధితుల ఫిర్యాదుతో ఎస్సై శ్రీను నాయక్ కేసు నమోదు చేశారు.