KMM: సత్తుపల్లి మున్సిపాలిటీ కార్యాలయంలో లో ఏసీబీ అధికారులు ఆకస్మికంగా సోదాలు నిర్వహిస్తున్నారు. మున్సిపల్ కమీషనర్, సిబ్బందిని ఏసీబీ డిఎస్పీ వై.రమేష్ విచారణ చేస్తున్నారు. కార్యాలయంలో అవినీతి జరుగుతున్నట్లు పలు ఫిర్యాదులు అందటంతో ఏసీబీ రంగంలో దిగినట్లు స్థానికులు తెలిపారు. లోపల వ్యక్తులను బయటకు రానివ్వకుండా గేట్లు వద్ద కానిస్టేబుళ్లు గస్తీ కాస్తున్నారు.