ప్రకాశం: పొదిలి పట్టణ మున్సిపల్ కార్యాలయంలో ఎమ్మెల్యే కందుల నారాయణరెడ్డి మంగళవారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. అధికారుల తీరుపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ప్రతి ఒక్కరూ పనితీరు మార్చుకోవాలన్నారు. ప్రజలకు అవసరమైన సేవలు అందేలా పనిచేయాలని ఎమ్మెల్యే ఆదేశించారు. ఈ కార్యక్రమంలో నాయకులు, అధికారులు పాల్గొన్నారు.