SKLM: కూటమి ప్రభుత్వం వెంటనే జిల్లాలో ఐటీడీఏ ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి బి. గోవిందరావు, జిల్లా కమిటీ సభ్యులు సిర్ల ప్రసాద్ డిమాండ్ చేశారు. మంగళవారం కొత్తూరు మండలం గొట్టిపల్లి గ్రామంలో సీపీఐ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. జిల్లాలో ఐటీడీఏ లేకపోవడంతో ఆదివాసీల సమస్యలు పరిష్కారం కావడం లేదని అభివృద్ధికి నోచుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.