HNK: నడికూడ(M) మండలంలోని కంఠాత్మకూరు గ్రామంలో ఈజీఎస్ పనులను స్థానిక ఎంపీడీవో రామకృష్ణ పరిశీలించారు. అనంతరం ఉపాధి హామీ శ్రామికులతో ఎంపీడీవో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఉపాధి హామీ పనులు చేసే వద్ద మౌలిక సదుపాయాలను కల్పించాలని, ఉపాధి హామీ పనులను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు ఉన్నారు.