AP: విశాఖలో జరిగిన మౌనిక హత్య కేసుపై ఆమె తండ్రి కన్నీటిపర్యంతమయ్యారు. తన కుమార్తెను క్రూరంగా చంపిన నిందితుడిని జీవితాంతం జైలులో పెట్టి ఉరితీయాలని డిమాండ్ చేశాడు. మౌనిక వద్ద ఉన్న 2 తులాల బంగారం మాయమైందని, ఈ కేసుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించి న్యాయం చేయాలని ఆయన వేడుకున్నాడు. తమకు వచ్చిన కష్టం ఎవరికీ రాకూడదని ఆవేదన వ్యక్తం చేశాడు.