SKLM: హిరమండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను శుక్రవారం కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాలను పరిశీలించారు. మధ్యాహ్నం భోజనం పథకం అమలు తీరుని పరిశీలించి, విద్యార్థులతో కలిసి మధ్యాహ్నం భోజనాన్ని చేశారు. మధ్యాహ్న భోజనంపై కలెక్టర్ సంతృప్తి వ్యక్తపరిచారు.