కర్నూలు రేంజ్ పరిధిలో ఆరుగురు సీఐలను బదిలీ చేస్తూ DIG డా.కోయ ప్రవీణ్ ఉత్తర్వులు జారీ చేశారు. పరిపాలనా కారణాలతో ఈ బదిలీలు తక్షణం అమల్లోకి వస్తాయని తెలిపారు. శ్రీరామ్ పులివెందుల టౌన్‌కు, సీతారామిరెడ్డి పులివెందుల రూరల్‌కు, శంకర్ రెడ్డి ఆర్.కె.వ్యాలీకి, ఉలసయ్య కడప వీఆర్‌కు, హాజీ వలీ నంద్యాల డీపీటీసీకి, శాంతి లాల్ పులివెందుల ట్రాఫిక్ విభాగానికి బదిలీ అయ్యారు.