AP: కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యలపై దృష్టి పెట్టడం లేదని మాజీ మంత్రి రోజా అన్నారు. శాసనసభకు రాలేదని మాట్లాడుతున్నారని.. సభకు వస్తే ఇష్టానుసారం మాట్లాడుతున్నారని తెలిపారు. ఛైర్మన్ కులం, మతం గురించి దిగజారి మాట్లాడారని మండిపడ్డారు. రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు మంచి చేయండని లేకపోతే రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండని సూచించారు.