అఖిల్ అక్కినేని 'ఏజెంట్' చిత్రం ఏప్రిల్ 28న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల కానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ విడుదలైన నిమిషాల్లోనే వైరల్‌గా మారడంతో సూపర్బ్ రెస్పాన్స్ వచ్చింది.
అఖిల్ అక్కినేని(akhil akkineni) నటిస్తున్న ఏజెంట్(Agent) మూవీ పై భారీ అంచనాలున్నాయి. ఇప్పటికే రిలీజ్ అయిన ట్రైలర్లో.. ఏప్రిల్ 28న థియేటర్లో భీభత్సం జరగబోతున్నట్టు చూపించారు. ఏజెంట్లో యాక్షన్ పీక్స్‌లో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. వైల్డ్ సాలేగా అఖిల్ చేసే భారీ యాక్షన్స్ సీక్వెన్స్‌ను ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి అదిరిపోయే స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కించాడు. సాక్షి వైధ్య హీరోయిన్గా ఇంట్రడ్యూస్ అవుతోంది. అఖిల్ కెరీర్లోనే కాదు.. మార్కెట్‌కు మించి ఈ సినిమా కోసం ఖర్చు చేశారు నిర్మాత అనిల్ సుంకర.
అందుకే ఈ సినిమా ప్రమోషన్స్‌ను పరుగులు పెట్టిస్తున్నారు. ఇప్పటికే వరంగల్‌లో గ్రాండ్‌గా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఇక ఈ సినిమా రిలీజ్‌కు మరో రెండు రోజులు మాత్రమే ఉంది. తాజాగా అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. రెండు తెలుగు రాష్ట్రాల్లోను టికెట్ బుకింగ్స్ ఓపెన్ అయ్యాయి. ఈ బుకింగ్స్‌కు సాలిడ్ రెస్పాన్స్ వస్తున్నట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్టే ఈ సినిమాకు సెన్సార్ టాక్ అదిరిపోయింది.
ఇప్పటికే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది ఏజెంట్. సెన్సార్ బోర్డ్ ఏజెంట్‌కు U/A సర్టిఫికేట్ ఇచ్చింది. ఈ సినిమా రన్ టైమ్ వచ్చేసి 2 గంటల 36 నిమిషాలుగా లాక్ చేశారు. ఇది పర్ఫెక్ట్ రన్ టైం అంటున్నారు అక్కినేని అభిమానులు. ఇక సెన్సార్ నుంచి ఏజెంట్‌కు పాజిటివ్ టాక్ వస్తోంది. సెన్సార్ సభ్యులు పాజిటివ్ రివ్యూ ఇచ్చినట్టు తెలుస్తోంది. సినిమా చాలా బాగా వచ్చిందని, ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ఓ రేంజ్లో ఉన్నాయని అంటున్నారట. మరి థియేటర్లో ఏజెంట్ ఆపరేషన్ ఎలా ఉంటుందో చూడాలి.