AP: టెంపుల్ సిటీ తిరుపతిపై యుద్ధం ఎఫెక్ట్ పడనుంది. రేపటి నుంచి కమర్షియల్ సిలెండర్ సరఫరా నిలిపివేయాలని గ్యాస్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి. 19.5 కిలోల సిలెండర్ల సరఫరా నిలిపివేయనున్నాయి. పలు గ్యాస్ కంపెనీల నిర్ణయంతో 3 వేలకు పైగా హోటల్స్కు ఎఫెక్ట్ పడనుంది. ఈ క్రమంలో గ్యాస్ బుకింగ్స్ పెరిగాయి. గృహ వినియోగదారులకు ఇబ్బందులు లేకుండా నిర్ణయం తీసుకున్నాయి.