NGKL: పేద ప్రజల సంక్షేమమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే రాజేశ్ రెడ్డి అన్నారు. ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో తాడూరు, బిజినేపల్లి మండలాలకు చెందిన కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు శుక్రవారం ఆయన చెక్కులను పంపిణీ చేశారు. ఎన్నికల హామీ మేరకు అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని ఈ సందర్భంగా ఆయన స్పష్టం చేశారు.