»Central Government Relief To Ttd In Foreign Currency Affairs
TTD : ఫారిన్ కరెన్సీ వ్యవహారంలో టీటీడీకి కేంద్రం ఊరట
తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకు(bank)లో డిపాజిట్(Deposit) చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది.
TTD : దక్షిణ భారత దేశంలోనే ప్రఖ్యాత పుణ్యక్షేత్రం తిరుపతి. తిరుమల వేంకటేశుడిని దర్శించుకునేందుకు భక్తులు(Devotees) ప్రపంచ నలుమూలల నుంచి వస్తారు. తమ సమస్యలు తొలగిపోవాలని మొక్కకుని ఏడు కొండల వాడికి భక్తులు కానుకలు సమర్పిస్తారు. వీదేశీయులు సైతం స్వామిని దర్శించుకొని తమకు తోచినంత విరాళాలు అందజేస్తారు. వారు స్వామి వారి హుండీలో ఫారిన్ కరెన్సీ(foreign currency)ని వేయడంతో దేవస్థానానికి చిక్కులు వచ్చిపడుతున్నాయి. ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ)కి కేంద్ర ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. శ్రీవారికి భక్తులు సమర్పించే ఫారిన్ కరెన్సి బ్యాంకు(bank)లో డిపాజిట్(Deposit) చేసుకునేందుకు కేంద్రం అంగీకరించింది. ఫారిన్ కరెన్సీ సమర్పించిన దాతల వివరాలు లేకపోయినా బ్యాంకులో డిపాజిట్ చేసుకునేందుకు టీటీడీ(TTD)కి మినహాయింపు ఇచ్చింది. సెక్షన్ 50 ప్రకారం ఈ మినహాయింపు లభించింది. ఈ మేరకు టీటీడీ ఈవోకు సమాచారం ఇచ్చింది కేంద్రం. భక్తులు శ్రీవారికి సమర్పించిన కానుకలుగా వాటిని పేర్కోన్నాలని కేంద్రం బ్యాంకులను కోరింది.
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది. సర్వదర్శనానికి నాలుగు గంటల సమయం పడుతోంది. గురువారం 56,680 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. వారిలో 18,947 మంది స్వామివారికి తలనీలాలను సమర్పించారు. తిరుమల తిరుపతి దేవస్థానానికి హుండీ(Hundi) ద్వారా 3.54 కోట్ల రూపాయల ఆదాయం లభించింది. వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య భారీగా పెరుగుతుందని టీటీడీ అధికారులు అంచనా వేస్తోన్నారు. గత ఏడాది వేసవి సీజన్(Summer Season) కంటే కూడా ఈ సారి భక్తులు రెట్టింపుగా వస్తారని భావిస్తోన్నారు. తిరుమలలో రద్దీ, ఎండ తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే ప్రత్యేక చర్యలను తీసుకున్నారు.