Mammootty mother:మలయాళ సూపర్ స్టార్ మమ్ముటికి (Mammootty) మాతృవియోగం కలిగింది. అనారోగ్యంతో తల్లి ఫాతిమా ఇస్మాయిల్ (93) (fatima Ismail) మృతిచెందారు. కొచ్చిలో గల ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈ రోజు సాయంత్రం ఆమె అంత్యక్రియలు (rites) నిర్వహిస్తారు. మమ్ముటికీ సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు. ఫాతిమా ఇస్మాయిల్‌కు (fatima Ismail) ఆరుగురు సంతానం. వారిలో మమ్ముటి (Mammootty) పెద్దవాడు. కొచ్చికి సమీపంలో గల చెంబు (chembu) వీరి స్వస్థలం కాగా.. ఫాతిమా అందరికీ తెలుసు. చెంబు ముస్లిం జమత్ మసీదు సమీపంలో ఇస్లాం మతం ప్రకారం అంత్యక్రియలను నిర్వహిస్తారు.
మమ్ముటి (Mammootty) తండ్రి ఇస్మాయిల్ గార్మెంట్, రైస్ బిజినెస్ ఉండేది. వ్యవసాయం కూడా చేసేవారు. తల్లి ఫాతిమా మాత్రం హౌస్ వైఫ్‌గా ఉండేవారు. ఫాతిమా- ఇస్మాయిల్ దంపతులకు మమ్ముటి తొలి సంతానం కాగా.. అతనికి ఇద్దరు తమ్ముళ్లు ఇబ్రహిం కుట్టీ, జకారియా, ముగ్గురు చెల్లెలు అమీనా, సౌదా, షాఫినా ఉన్నారు.
మమ్ముటి (Mammootty) సుల్ఫత్ కుట్టీని 1979లో పెళ్లి చేసుకున్నారు. వరికి సురుమి అనే కూతురు, దుల్కర్ సల్మాన్ అనే కుమారుడు ఉన్నారు. దుల్కర్ సినిమాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తెలుగులో వచ్చిన ‘సీతారామం’ మూవీలో నటించి, మెప్పించాడు. మమ్ముటి చిన్న తమ్ముడు ఇబ్రహీం కుట్టి మలయాళ సినిమాల్లో నటించారు. అతని కుమారులు మక్బూల్, అస్కార్ సౌదన్ మలయాళ సినిమాలు, సీరియళ్లలో నటించారు.