కామారెడ్డి: మోడల్ స్కూల్లో చదివేందుకు విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని సదాశివనగర్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ రాజిరెడ్డి నేడు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీలోపు ఆరో తరగతి ప్రవేశాల కోసం ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవాలన్నారు.