»Suriya 42 Movie Title Kanguva Release In 10 Languages
Suriya 42: మూవీ టైటిల్ ఫిక్స్ ..కంగువా 10 భాషల్లో రిలీజ్
సూర్య(Suriya) అభిమానులకు గుడ్ న్యూస్ వచ్చేసింది. అది ఏంటంటే సూర్య 42వ చిత్రానికి టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ఈ క్రమంలో కంగువా(Kanguva) టైటిల్ లుక్‌తోపాటు ఓ వీడియోను కూడా మేకర్స్ షేర్ చేశారు.
తమిళ్ స్టార్ హీరో సూర్య(Suriya) తన మొదటి పాన్ ఇండియా చిత్రం సూర్య 42కు టైటిల్ ఖారారైంది. దీంతో ఎన్నో రోజులుగా ఈ మూవీ టైటిల్ కోసం ఉత్సాహంగా ఎదురు చూస్తున్న అభిమానుల నిరీక్షణ ఎట్టకేలకు ముగిసింది. ‘సూర్య 42’కి ‘కంగువా(kanguva)’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. టైటిల్‌తోపాటు ఓ ఆసక్తికర వీడియోను కూడా మేకర్స్ అధికారికంగా రిలీజ్ చేశారు.
ఇక వీడియోలో ఒక డేగ, కుక్క, ముసుగు ధరించిన యోధుడు గుర్రంపై స్వారీ చేస్తున్న దృశ్యాన్ని చూడవచ్చు. ఆ యోధుడి వెనుక ఓ భారీ సైన్యం కూడా ఉంది. కానీ హీరో సూర్య ముఖాన్ని మాత్రం రివీల్ చేయలేదు. మరోవైపు టైటిల్ పోస్టర్ లుక్ కూడా క్రేజీగా కనిపిస్తుంది. రెండు రెక్కలు విప్పుకున్న గద్ద మధ్యలో కంగువా అనే టైటిల్ ఉండటాన్ని పోస్టర్లో చూడవచ్చు. అంతేకాదు ఆ గద్దకు ఆయుదాలు రక్షణగా ఉండటం కూడా గమనించవచ్చు. వీటిని చూస్తే సినిమాపై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఈ చిత్రం మధ్యయుగ యోధుల ఇతిహాసం నేపథ్యంలో భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. కె.ఇ.స్టూడియో గ్రీన్ బ్రాండ్‌పై యూవీ క్రియేషన్స్‌తో కలిసి జ్ఞానవేల్‌రాజా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
సూర్య ఫస్ట్ పాన్ ఇండియా సినిమా కావడంతో ఈ సినిమాపై ఇప్పటికే అభిమానులు, సినీ ప్రేక్షకుల్లో పెద్ద ఎత్తున అంచనాలు ఏర్పడ్డాయి. సిరుత్తై శివ(siva) దర్శకత్వంలో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్ గా దిశా పటాని(DishaPatani) యాక్ట్ చేస్తుంది. ఆమెతోపాటు యోగి బాబు, రెడిన్ కింగ్స్లీ, కోవై సరళ, ఆనంద్ రాహ్ కూడా నటించారు. దేవి శ్రీ ప్రసాద్(DeviSriPrasad)సంగీతం సమకూర్చారు. మేలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నారు. అంతేకాదు ఈ సినిమా 2024 ప్రారంభంలో థియేటర్లలో 10 భాషల్లో విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో సూర్య తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో కంగువా వీడియోను షేర్ చేశారు. అతను దానికి క్యాప్షన్ ఇచ్చారు. ఈ అద్భుతమైన సాగాలో శివ(siva) & టీమ్‌తో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉందని రాసుకొచ్చారు. దీంతోపాటు కంగువా టైటిల్ లుక్‌ని షేర్ చేయడం సంతోషంగా ఉందని వెల్లడించారు.