WGL: సంగెం మండలం మచ్ఛాపూర్ గ్రామంలో మంగళవారం కుటుంబ కలహం నేపథ్యంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. బానోత్ వినోద్ కుమార్ అనే వ్యక్తి తన అత్త ఇంటికి వెళ్లి గొడవకు దిగాడు. దీంతో మామ రవి అల్లుడు వినోద్‌ను రాయితో కొట్టి గాయపరిచాడు. అడ్డుపడిన అత్త చేతిని అల్లుడు కొరికాడు. బాధితుల ఫిర్యాదు మేరకు SI వంశీకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.