KNR: ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇటీవల జరిగిన హోంగార్డుల ట్రాన్స్ఫర్పై ఇంటెలిజెన్స్ వర్గాలు ఆరా తీస్తున్నాయి. కరీంనగర్ సీపీ 337 మంది హోంగార్డుల వద్ద డబ్బులు తీసుకుని ట్రాన్స్ఫర్ చేశారని, హుజురాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఆరోపించిన విషయం విధితమే. 186 మంది హోంగార్డుల వద్ద ఒక్కో హోంగార్డు నుంచి రూ.1 లక్ష చొప్పున రూ.1.86 కోట్లు వసూలు చేశారన్నారు.