PDPL: జూలపల్లి మండలంలోని కాచాపూర్ ప్రాథమికోన్నత పాఠశాల మధ్యాహ్న భోజన నిర్వహణలో రాష్ట్రస్థాయి పురస్కారం పొందడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ కోయ శ్రీహర్ష తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం సిబ్బందిని అభినందించిన ఆయన, అన్ని పాఠశాలలు ఇదే స్ఫూర్తితో ఎండీఎం నిర్వహణలో ఉత్తమ ప్రమాణాలు పాటించాలన్నారు. డా. పీఎం, ఎంఈవో, హెచ్ఎం, ఉపాధ్యాయుడు పాల్గొన్నారు.