తిరుపతిలో సోమవారం ఉదయం వాకర్స్ ఆందోళనకు దిగారు. నగరవనం (దివ్యారామం) లోకి డబ్బులు చెల్లిస్తేనే ఎంట్రీ ఉంటుందని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఈక్రమంలో వాకర్‌ను అడ్డుకున్నారు. దీంతో అందరూ కలిసి కపిలతీర్థం-అలిపిరి రోడ్డుపై ఆందోళనకు దిగారు. కిలో మీటర్ మేర వాహనాలు ఆగిపోయాయి. తిరుమల-తిరుపతి మధ్య రాకపోకలు సాగించే భక్తులు ఇబ్బంది పడుతున్నారు.