MDK: ఎమ్మెల్యే డాక్టర్ మైనంపల్లి రోహిత్ రావు సహకారంతో రామాయంపేట మండలం రాయలపూర్ గ్రామానికి చెందిన రాగి సందీప్‌కు రూ.60 వేల ఎల్ఓసి చెక్కును అందజేశారు. ఆపదలో ఉన్నవారికి అండగా ఉంటామని, నియోజకవర్గ ప్రజల సంక్షేమమే ఎమ్మెల్యే ధ్యేయమని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ గజవాడ లావణ్య నాగరాజు, పట్టణ అధ్యక్షుడు చింతల స్వామి తదితరులు పాల్గొన్నారు.