PDPL: ధర్మారం మండలం నంది మేడారం గ్రామాన్ని 100% సోలార్ వినియోగ గ్రామంగా తీర్చిదిద్దుతున్నామని మంత్రి అట్లూరి లక్ష్మణ్ కుమార్ తెలిపారు. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క చొరవతో గ్రామం ఎంపికైనట్లు చెప్పారు. తొలి విడతలో 1,486 గృహాలకు, రెండో విడతలో 628 వ్యవసాయ పంపులకు సోలార్ ప్యానెల్లు ఏర్పాటు చేస్తామని మంత్రి వెల్లడించారు.