NTR: నందిగామలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య అంగన్వాడీ కార్యకర్తల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. వేతనాల పెంపు, ప్రతి నెల ఒకటో తేదీన జీతాల చెల్లింపు, 5G స్మార్ట్ ఫోన్ల పంపిణీ వంటి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. 5,000 మినీ కేంద్రాలను అప్గ్రేడ్ చేసి సదుపాయాలు మెరుగుపరుస్తున్నామని పేర్కొన్నారు.