మహబూబ్నగర్ రీజియన్ పరిధిలోని 10 ఆర్టీసీ డిపోల్లో అప్రెంటిషిప్ శిక్షణకు దరఖాస్తులు కోరుతున్నట్లు ఆర్ఎం సంతోష్ కుమార్ తెలిపారు. గ్యారేజ్, ఆపరేషన్ విభాగాల్లో శిక్షణ ఉంటుందన్నారు. 2021 తర్వాత ఉత్తీర్ణులైన ఇంజినీరింగ్, డిప్లమా, అలాగే BA, BCom, BSc పట్టభద్రులు NATS వెబ్సైట్లో ఈ నెల 16లోగా దరఖాస్తు చేయాలని సూచించారు.