ADB: నార్నూర్ మహాగావ్ శివారులో శనివారం పోలీస్ సిబ్బంది డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించారు. అనంతరం వాహనదారులకు రోడ్డు భద్రతపై పలు సూచనలు చేశారు. పోలీసుల ట్రాఫిక్ నియమాలను పాటించాలన్నారు. మద్యం తాగి వాహనాలు నడిపితే కేసు నమోదు చేయడమే కాకుండా వాహనాన్ని సీజ్ చేస్తామని హెచ్చరించారు. రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు హెల్మెట్ తప్పనిసరిగా వాడాలని పోలీసులు సూచించారు.