TPT: గూడూరు నియోజకవర్గం చిల్లకూరు మండలం కలవకొండకు చెందిన బూదురు సునీల్ కుమార్ ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. పొదలకూరులోని శ్రీచైతన్య స్కూల్లో ఆయన ప్రిన్సిపల్‌గా పనిచేస్తున్నారు. విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. తన చావుకు శ్రీచైతన్య స్కూల్ ఏజీఎం నర్ర శ్రీకాంత్ వేధింపులే కారణమని, పిల్లలను ఐఏఎస్, ఐపీఎస్ చదివించాలన్నదే చివరి కోరికగా లేఖలో పేర్కొన్నారు.