కామారెడ్డి ఎస్పీ రాజేష్ చంద్ర శుక్రవారం బాన్సువాడ పోలీస్ స్టేషన్ ఆకస్మికంగా సందర్శించారు. ఆయన పోలీస్ స్టేషన్లలోని రికార్డులను పరిశీలించారు. శాంతిభద్రతల పరిరక్షణపై అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా నేరాల నియంత్రణ, రాత్రి వేళ గస్తీని పెంచడం, అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ విఠల్ రెడ్డి ఉన్నారు.