NLG: అంగన్వాడీ టీచర్ల సమస్యలను పరిష్కరించలంటూ తెలంగాణ అంగన్వాడీ టీచర్స్ హెల్పర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం అంగన్వాడీ టీచర్లు మిర్యాలగూడ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డికి వినతి పత్రం అందజేశారు. ఎండ తీవ్రత అధికంగా ఉన్నందున ప్రభుత్వ పాఠశాలల మాదిరిగానే అంగన్వాడీ కేంద్రాలకు కూడా మార్చి 15 నుంచి ఒక్క పూట బడికి అనుమతి ఇవ్వాలని ఎమ్మెల్యేను కోరారు.